Breaking News

30/01/2019

వాహనాలకు రాష్ట్రవ్యప్తంగా ఒకే సిరీస్

విజయవాడ, జనవరి 30, (way2newstv.in)
 ఒకే రాష్ట్రం.. ఒకే సిరీస్ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ అమల్లోకి తెచ్చింది. దీంతో ఏపీలో అన్ని వాహనాలకు బుధవారం నుంచి ఏపీ 39 సిరీస్ అందుబాటులోకి వచ్చింది. ఈ సిరీస్తో వాహనాలకు రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఏకీకృత నమోదు విధానాన్ని విజయవాడలో రవాణాశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు.  మంత్రి మాట్లాడుతూ ఒకే రాష్ట్రం, ఒకే సిరీస్ విధానం ప్రపంచంలో ఎక్కడా లేదని అన్నారు. ఒక రాష్ట్రం, ఒక సిరీస్ విధానంతో అందరికీ ఆదర్శంగా నిలిచాం. నాలుగేళ్ల క్రితం రవాణా శాఖ అంటే చాలా చెడ్డ పేరు ఉంది. లైసెన్స్  లను  అధికారుల నుంచి  కాకుండా ఏజెంట్ల ద్వారా ప్రజలు  పొందేవారు. 



టిడిపి అధికారంలోకి వచ్చాక అటువంటి విధానాన్ని అరికట్టి సేవలను సరళీకృతం చేశామని అన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకుని ప్రజలకు ఎన్నో రకాల సేవలను అందిస్తున్నాం. ఒకే రాష్ట్రం, ఒకే సిరీస్ విధానాన్ని త్వరగా అందుబాటులో కి తేవడం వెనుక రవాణా శాఖ కమిషనర్, సిబ్బంది శ్రమ ఎంతో ఉంది. ఈ విధానం ద్వారా ప్రభుత్వానికి మరింత ఆదాయం కూడా వస్తుంది. ఎక్కడా పన్నులు పెంచకుండా..రవాణా శాఖ ఆదాయాన్ని పెంచామని అన్నారు. వేలి ముద్ర లు పడకపోవడం వల్ల  రిజిస్ట్రేషన్ ఆగిపోతుంది, అందువల్ల ఐరిస్ విధానాన్ని అందుబాటులోకి తెస్తాం. నేడు రవాణా శాఖ లో గణనీయమైన మార్పులు తీసుకొచ్చాం. ఇళ్లు, కళాశాలలు, కార్యాలయాలకు వెళ్లి  యల్.యల్.ఆర్ మేళాలు నిర్వహించాం. ఒకప్పుడు చాలా ఇబ్బంది ఉండేది.. ఇప్పుడు గంటలో యల్.యల్.ఆర్ ను ఇస్తున్నాం. అభయ యాప్ ను అందుబాటులోకి తెచ్చి రవాణా వాహనాల్లో ప్రయాణం చేసే మహిళలకు భద్రత, భరోసా కల్పిస్తామని అన్నారు. అవినీతికి కేంద్రం గా ఉన్న రవాణా శాఖ ను నాలుగేళ్ల కాలంలో ఆదర్శ శాఖగా మార్చాం. ఎక్కడా అవినీతి కి ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకంగా సేవలు అందిస్తున్నాం. ఒకె రాష్ట్రం, ఒకే సిరీస్ విధానం నా హయాంలో రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో రవాణాశాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం, ఉన్నతాధికారులు పాల్గొన్నారు

No comments:

Post a Comment