Breaking News

30/01/2019

కేంద్రం హామీలు నెరవేర్చలేదు

అమరావతి, జనవరి 30, (way2newstv.in)
అమరావతిలో ఏపీ 13 వ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన వెంటనే గవర్నర్ నరసింహన్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగించారు. 56 నిమిషాల పాటు గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. 99 అంశాలపై 40 పేజీలను గవర్నర్ ప్రసంగించారు. విభజన చట్టంలోని చాలా హామీలు కేంద్రం నెరవేర్చలేదు  ప్రజలు ఆతృతగా ఎదురు చూసినా కేంద్రం ఆర్థికంగా ఆదుకోలేదు. ఏపీ తలసరి ఆదాయం లేక ఇబ్బందులు పడుతోంది. రాష్ట్రం అనేక విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకుండా పోయింది. వినియోగ పత్రాలను నీతి ఆయోగ్ ధ్రువీకరణ చేసింది. రాష్ట్ర ఖజానాకు జమచేసిన రూ.350 కోట్లు వెనక్కు తీసుకుంది. 


కేంద్రం హామీలు నెరవేర్చలేదు

ఇచ్చిన నిధులు వెనక్కి తీసుకుంటుందని రాష్ట్రం ఊహించలేదు. విభజన కారణంగా ఆర్థిక, ఇతర వనరులపై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. రాష్ట్ర నాయకత్వం వల్ల కష్టాలనుంచి గట్టెక్కాం. ప్రతికూలతలను అధిగమించి మార్గదర్శకంగా నిలిచాం. కేంద్రం సహాయ నిరాకరణకు పాల్పడుతూ తోడ్పాటు అందించలేదు. తోడ్పాటు అందించకపోయినా రాష్ట్రం వృద్ధిరేటు నమోదు చేసింది. కేంద్రం సాయం చేసి ఉంటే సాఫల్యత మరింత ఎక్కువగా ఉండేది. వయాడక్ట్ విధానం ద్వారా ఆర్థిక పురోగతిని సాధించేందుకు కృషి  చేస్తున్నామని అయన పేర్కోన్నారు. అవినీతి రహిత, పారదర్శక పాలనకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సాగునీటికి ఐదేళ్లలో రూ.64,333 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. 32 లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చింది. పోలవరం ప్రాజెక్టు పూర్తికి రూ.15,585 కోట్లు ఖర్చు చేశారు. 2019 చివరి నాటికి ప్రాజెక్టు పూర్తిచేయాలని ప్రభుత్వ నిర్ణయించింది. కృష్ణా-గోదావరి నదుల అనుసంధానంతో నీటి కొరత అధిగమించామని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కోన్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి.

No comments:

Post a Comment