Breaking News

18/08/2018

ఐఎస్ఐ మార్క్ హెల్మెట్ తో సంపూర్ణ రక్షణ

హైదరాబాద్ ఆగస్టు18 (way2newstv.in) 
ఐఎస్ఐ మార్క్ లేని హెల్మెట్ ఉత్పత్తి,నిలువ ,అమ్మకం చట్ట రిత్య నేరం అంటూ కేంద్ర రోడ్డు రావాణ,హెవి మినిస్ట్రీ విడుదల చేసిన నోటిఫికేషన్ ను ద్విచక్ర వాహనాల హెల్మెట్ తయారి సంస్థల సంఘం హర్షం వ్యక్తం చేసింది.ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో సంఘం అద్యక్షులు,స్టీల్ బర్డ్ హెల్మెట్ తయారీ సంస్థ ఎండి.రాజీవ్ కపూర్ మాట్లాడుతూ ద్విచక్రవాహనం దారులు నాణ్యమైన హెల్మేట్ వాడక పోవడం వల్ల ప్రమాదం జరిగినపుడు తలకు దెబ్బలు తగిలి ప్రాణాలను కోల్పోవలసి వస్తుందన్ ఆవేదన వ్యక్తం చేసారు..దీనిని దృష్టి పెట్టుకొని వాహన దారుల సంక్షేమాన్ని కోరుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షనీయమన్నారు.నాణ్యత లేని హెల్మెట్ వాహన దారునికి రక్షణ ఇవ్వలేవని,ఐఎస్ఐ మార్క్ ఉన్న హెల్మేట్ వాడాలని ఆయన కోరారు.మరో రెండు నెలల్లో ఈ నోటిఫికేషన్ అమలులోకి వస్తున్నందున హెల్మెట్ కొనే వాహన దారులు ఐఎస్ఐ మార్క్ ఉన్న హెల్మేట్ లు కొంటె రక్షణగా నిలుస్తుందని రాజీవ్ కపూర్ పేర్కొన్నారు.



ఐఎస్ఐ మార్క్ హెల్మెట్ తో సంపూర్ణ రక్షణ 

No comments:

Post a Comment