Breaking News

09/08/2018

వైసీపీ కి తలనొప్పి గా మారిన పాడేరు

విశాఖపట్టణం, ఆగస్గు 9, (way2newstv.in) 
రాజ‌కీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు. ఎప్పుడు ఎలా మార‌తాయో చెప్ప‌డ‌మూ క‌ష్ట‌మే! గ‌త 2014లో ఉన్న రాజ‌కీయ ప‌రిస్థితి ఇప్పుడు ఏపీలో భూత‌ద్దం ప‌ట్టుకుని వెతికినా క‌నిపించ‌డం లేదు. అదేవిధంగా విశాఖ జిల్లా మ‌న్యం నియోజ‌క వ‌ర్గం పాడేరులోనూ రాజ‌కీయాలు మారిపోతున్నాయి. ఇక్క‌డ నిన్న మొన్న‌టి వ‌ర‌కు బ‌లంగా ఉన్న వైసీపీ ఇప్పుడు నాయ‌కుడు లేక అల్లాడిపోతోంది. అంతేకాదు, వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ కోసం.. నాయ‌కులు కొట్టుకొంటూ.. నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని లేకుండా నే చేసుకుంటున్నారు. నిజానికి గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి టికెట్ పొంది గెలుపు గుర్రం ఎక్కిన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రి.. అప్ప‌ట్లో గెలిచేందుకు నానా తంటాలు ప‌డ్డారు. నియోజ‌క‌వ‌ర్గంలో సుదూరంగా విసిరేసిన‌ట్టు ఉండే.. కొండ ప్రాంతాల్లోనూ కాలిన‌డ‌క‌న గంట‌ల త‌ర‌బ‌డి ప్ర‌యాణించి .. ఆమె ప్ర‌జ‌ల‌ను క‌లుసుకున్నారు.పార్టీ గురించి వివ‌రించారు. ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తెచ్చారు. ప్ర‌జ‌ల‌కు అనేక హామీలు ఇచ్చారు. వైసీపీ కి తలనొప్పి గా మారిన పాడేరు

రోడ్లు, మౌలిక స‌దుపాయాలు, తాగునీరు, విద్య, వైద్యం వంటి అంశాల‌పై ప్ర‌జ‌ల‌ను ఒప్పించారు. ప‌లితంగా ఆనాడు జ‌గ‌న్ హ‌వా ఉన్న‌ప్ప‌టికీ.. గిడ్డి ఈశ్వ‌రి ఒంట‌రిపోరుతోనే ఇక్క‌డ గెలుపొందార‌నేది అక్ష‌ర స‌త్యం. గిడ్డి ఇక్క‌డ భారీ మెజార్టీతో గెలిచి ప్ర‌త్య‌ర్థుల‌కు తిరుగులేని షాక్ ఇచ్చారు. ఇక‌, ఇప్పుడు ఈమె టీడీపీలో ఉన్నారు. మ‌రి వైసీపీ ప‌రిస్థితి ఏంటి? వైసీపీ త‌ర‌ఫున ఏం జ‌రుగుతోంది? అనే ప్ర‌శ్న‌లు సాధారణంగానే తెర‌మీదికి వ‌స్తున్నాయి.వైసీపీ నుంచి తనకే టిక్కెట్‌ వస్తుందనే ఆశతో సమన్వయకర్త కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి పనిచేస్తున్నారు. కానీ ఈ పార్టీలో ఉన్న మరో రెండు వర్గాల కారణంగా ఆమె దూకుడు పెంచలేని పరిస్థితి. మాజీ మంత్రి మత్స్యరాస బాలరాజు, మాజీ ఎంపీపీ మత్స్యరాస వెంకటగంగరాజు, చింతపల్లి జడ్పీటీసీ సభ్యురాలు కంకిపాటి పద్మకుమారిని ఎదుర్కొనేందుకు కసరత్తు చేస్తున్నారు. సమన్వయకర్తకు, అరకులోయ పార్లమెంట్‌ నియోజకవర్గం సమన్వయకర్త పరీక్షిత్‌రాజ్‌ తీరుకు నిరసనగా నియోజకవర్గం వ్యాప్తంగా సమావేశాలు నిర్వహించి, బహిరంగంగానే విమర్శలు ఎక్కుపెడుతున్నారు.ఇది కాకుండా నియోజకవర్గంలో బలమైన సామాజిక వర్గం కొండదొరలు సైతం వైసీపీ నేత భాగ్యలక్ష్మికి వ్యతిరేకంగా, దివంగత సీపీఐ నేత మాజీ ఎమ్మెల్యే జి.దేముడు కుమార్తె జి.మాధవిని తెరపైకి తీసుకువస్తున్నారు. వైసీపీ నుంచి మాధవికి పాడేరు టిక్కెట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో భాగ్యలక్ష్మికి రెండు వర్గాలతో తలనొప్పి ఎదురవుతోంది. అయినప్పటికీ తన తండ్రి, దివంగత మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి చిట్టినాయుడు పేరు, గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో ట్రైఫెడ్‌ వైస్‌ ఛైర్మన్‌గా చేసిన అనుభవం, పరిచయాలతో సాగుతున్నారు. కానీ, ఇవేమీ వ‌ర్క‌వుట్ అయ్యే ప‌రిస్థితి క‌నిపించ‌డంలేదు. దీంతో పాడేరులో వైసీపీ ప‌రిస్థితి గ‌ల్లంతేన‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. విచిత్రం ఏంటంటే ఇక్క‌డ వైసీపీ నుంచి గెలిచిన గిడ్డి ఈశ్వ‌రి పార్టీ మారినా నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ కార్య‌క‌ర్త‌లు ఆమె వెంట వెళ్ల‌లేదు. ఇప్ప‌ట‌కీ వైసీపీ పాడేరులో క్షేత్ర‌స్థాయిలో బ‌లంగా ఉంది. అయితే స‌రైన నాయ‌క‌త్వ లేమి లేక కొట్టుమిట్టాడుతోంది. మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి.

No comments:

Post a comment