Breaking News

21/08/2018

మంత్రి పద్మా రావు ఇలాఖలో టిఆర్ఎస్ శ్రేణుల్లో చిచ్చురేపిన నామినేటెడ్ పోస్ట్

హైదరాబాద్ ఆగష్టు 21 (way2newstv.in)
రాష్ట్ర  అబ్కారి,క్రీడలు యువజన శాఖ మంత్రి పద్మా రావు నియోజకవర్గమైన సికింద్రాబాద్ లో ఓ మహిళా కార్యకర్తకు కేటా యించిన నామినేటెడ్ పోస్ట్ టిఆర్ఎస్ నేతలు కార్యకర్తల్లో చిచ్చు రేపింది.తెలంగాణాలో ప్రభుత్వం ఏర్పడి దాదాపు నాలుగున్నర సంవత్స రాలు కావుస్తున్నప్పటి ఆశించిన మేరకు ప్రభుత్వం పార్టీ శ్రేనులను తృప్తి పరుచలేక పోయింది. ఎన్నికల సమయం లో టిక్కట్లు రానివారికి నామినేటెడ్ పోస్టల ఆశ చూపిన ముఖ్య మంత్రి కేసిఅర్ తిరిగి ఎన్నికలు సమీపిసున్నప్పటికి పార్టీ సీనియర్లకు ఇదిగో నామినేటెడ్ పోస్ట్ అదిగో నామినేటెడ్ పోస్ట్ అంటూ దాటవేస్తూ వస్తున్నారు.ఈ క్రమంలోనే మంత్రి పద్మారావు తన నియోజక వర్గం లో పార్టీ శ్రేనులను బుజ్జగిస్తూ వస్తున్నారు.హటాత్తుగా ఇటీవల మంత్రి ,స్తానిక కార్పొరేటర్  సామాజిక వర్గానికి చెందిన స్వప్న గౌడ్ అనే ఓ మహిళా కార్యకర్తకు ఎన్సిసి అడ్వైజరీ బోర్డ్ మెంబర్ గా నామినేట్ చేస్తూ నియమించారు.



మంత్రి పద్మా రావు ఇలాఖలో టిఆర్ఎస్ శ్రేణుల్లో
             చిచ్చురేపిన నామినేటెడ్ పోస్ట్ 

దీనితో సికింద్రాబాద్ నియోజకవర్గం లోని పార్టీ నేతలు, సీనియర్లు ఒక్కసారిగా అగ్గి మీద గుగ్గిలమైనారు. స్వప్నను ఎన్ సి సి అడ్వైజరీ బోర్డ్ మెంబర్ మెంబర్ గా నియమించారని తెలిసిన స్తానిక నాయకులు ఆగష్టు 1 వ తేదీన సితాఫల్ మండిలో ఓ కార్యక్రమం లో మంత్రిని నిలదీశారు.ముక్యంగా మహిళా సీనియర్ నాయకులు తెలంగాణా ఉద్యమం లో పోరాటం చేసిన మమ్ములను విడిసి అంతే కాకుండా ఎన్నికల్లో పార్టీకోస రేయం     బవల్లు పని చేసిన తమను కాదని స్తానికేతరురాలైన వరంగల్ జిల్లా కు చెంది న సామాన్య కార్యకర్తకు నామినేటెడ్ పోస్ట్ ఎలా ఇస్తారని మంత్రిని నిలదీశారు.మంత్రి తన సామాజిక వర్గానికి చెందినా వారికి మాత్రమే ప్రాదాన్యత నిస్తున్నారని విమర్శలు గుప్పించారు.ఈ సందర్బంగా ఆవేశానికి గురైన తార్నాకకు చెందిన ఓ మహిళా నాయకు రాలు  వంటి ఫై కిరోసిన్ పోసుకొని నిప్పంటించు కొబోగా ప్రక్క నున్న మహిళలు అడ్డుకొని వారించారు.దీనితో అక్కడి మహిళల కార్యకర్తలు మంత్రిని శాపనార్తలు పెట్టారు.  సినియర్ నాయకులు సహితం వారికి సపోర్టు చేసారు. కాగా దీనితో మంత్రి స్వప్న గౌడ్ పోస్ట్ ను కాన్సల్ చేస్తామని హామీ ఇవ్వడం తో పార్టీ శ్రీనులు శాంతించారు.కాని ఇటీవల మంత్రి సచివాలయం లో స్వప్న గౌడ్ కు నియామక పత్రాన్ని అందజేయడం, డానికి సంబందించిన ఫోటో పత్రికల్లో రావడం తో తిరిగి మల్లి నిప్పు అంటుకుంది.మంత్రి మాట తప్పారని, మమ్ములను మోసం చేసాడని, కోపోద్రిక్క్తులవుతున్నారు. ఈ సారి ఎన్నికల్లో మాదగ్గరికి ఎలా వస్తాడో చుస్త్తామని  పేర్కొన్నట్లు సమాచారం.దీనితో  ఒకింత అసహనానికి గురైన మంత్రి  మీరెవ్వరు నాకు సపోర్ట్ చేయకున్నా గెలుస్తానని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

No comments:

Post a Comment