Breaking News

10/08/2018

టార్గెట్ 2019..

‌నిజామాబాద్, ఆగస్టు10, 2018 (way2newstv.in)  
వచ్చే ఎడాది ఎన్నికలకు నిజామాబాద్ లోని అన్ని పార్టీల నేతలు ఇప్పట్నుంచే రెడీ అయిపోతున్నారు. ప్రచారపర్వంలో దూసుకెళ్లి.. విజయం కైవసం చేసుకునేందుకు హోమ్ వర్క్ మొదలు పెట్టారు. అధికార పార్టీ నేతలు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక విపక్షం నేతలైతే.. సర్కార్ వైఫల్యాలనే హైలెట్ చేస్తూ.. గ్రాఫ్ పెంచుకోవాలని ట్రై చేస్తున్నారు. ఏదేమైనా జిల్లాలో.. ఎలక్షన్ వ్యూహాలు స్టార్టయ్యాయి. నవంబర్, డిసెంబర్ నాటికి ఈ స్ట్రాటజీలు తారస్థాయికి చేరుకుని.. ప్రజల చెంతకు వెళ్లే కార్యక్రమాన్ని నేతలు ముమ్మరం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలాఉంటే టీఆర్ఎస్, కాంగ్రెస్ తో పాటూ బీజేపీ నేతలూ.. ఎన్నికల కసరత్తు స్టార్ట్ చేశారు. పలు ప్రాంతాల్లో పట్టు నిలుపుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రధానంగా ప్రధాని మోడీ విజయాలపైనే ఎక్కువగా ఆధారపడినట్లు తెలుస్తోంది. నాలుగేళ్లలో మోడీ హయాంలో దేశం సాధించిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అంతేకాక రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం అమలు చేస్తున్న పథకాలనూ ప్రజలకు వివరించి మార్కులు కొట్టేయాలని స్థానిక కమలనాథులు భావిస్తున్నారు. ఇదిలాఉంటే.. దేశవ్యాప్తంగా బీజేపీ ఇప్పట్నుంచే ఎన్నికలకు ఏవిధంగా వెళ్లాలన్న విషయమై కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. సార్వత్రిక సమరం సమీపిస్తున్న వేళ జాతీయ స్థాయిలో కమలనాథులు తమ ఎన్నికల అస్త్రాలాను సిద్దం చేసుకుంటున్నారని విశ్లేషకులు చెప్తున్నారు.  టార్గెట్ 2019...

ప్రస్తుతం మోడీ సర్కార్ పై కొంత వ్యతిరేకత ఉంది. అయితే ఎన్నికల నాటికి మాత్రం  సత్పలితాలే వస్తాయని బీజేపీ విశ్వసిస్తోంది. 2019 ఎన్నికల్లో మోడీ.. త్రీడీ ఫార్ములా తో సిద్దమవుతున్నారని పలువురు అంటున్నారు. దేశ భద్రత, దళిత-బలహీన వర్గాల సంక్షేమం, రామమందిరం అనే మూడు అంశాలతో ముందుకెళ్లే విధంగా ప్లాన్ చేస్తున్నారని చెప్తున్నారు. గత ఎన్నికల్లో అభివృద్ధి ప్రత్యక్ష అజెండాగా.. రామ మందిర నిర్మాణం పరోక్ష అజెండాగా పోటీ చేసి, ఊహించని రీతిలో విజయం సాధించింది బీజేపీ. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఎలాగైనా ఓడించాలని పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ   ఇప్పటికే ఏక తాటిపైకి వస్తున్నాయి. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన సంఘటనలకు మతోన్మాదమే కారణమంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి.మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా దళితులు, ముస్లింలు, బలహీన వర్గాలపై దాడులు పెరిగి పోయాయని ఆరోపణలు గుప్పిస్తున్నాయి. అయితే.. ఎన్నికల నాటికి పుంజుకుంటామని.. గెలుపు తమనే వరిస్తుందని కమలనాథులు ధీమా వ్యక్తంచేస్తున్నారు. బీజెపీ నాలుగేళ్ళ పాలనపై విమర్శలు గుప్పిస్తున్నాయి ప్రతిప్రక్ష పార్టీలు. ఇక ఎన్నికల టైమ్ సమీపించడంతో కాషాయదళానికి చెక్ పెట్టేందుకు ఏకమయ్యే ప్రయత్నాలూ ముమ్మరం చేశాయి. ఏదేమైనా.. తమపై అదేపనిగా ఆరోపణలు చేస్తున్న విపక్షం నోరు మూయించేందుకు బీజేపీ రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే త్రీడీ ఫార్ములాతో బరిలోకి దిగేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంది.

No comments:

Post a Comment