Breaking News

03/07/2018

రైతులను చైతన్యపరచాలి : సీఎం చంద్రబాబు

అమరావతి, జూలై 3(way2newstv.in)
వచ్చే మూడు నెలలు వ్యవసాయానికి ఎంతో కీలకమని, రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మంగళవారం నీరు- ప్రగతి, వ్యవసాయంపై సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి పండించడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు. సేద్యానికి అనుకూల వాతావరణం సిద్ధం చేశాం. పండించిన పంటలకు లాభం వచ్చేలా చేయాలి. గతంలో నకిలీ విత్తనాలు, తెగుళ్ల బెడద,ఎరువుల కొరత,విద్యుత్ కోతలు ఉండేవి.  గత 4ఏళ్లుగా ఆ సమస్యలు లేకుండా పరిష్కరించామని అన్నారు. 



రైతులను చైతన్యపరచాలి : సీఎం చంద్రబాబు 

రైతులకు ఖర్చులు తగ్గించి వ్యవసాయ దిగుబడులు పెంచుతున్నామని, ఎప్పటికప్పుడు మార్కెటింగ్ సమస్యలు పరిష్కరిస్తున్నామని సీఎం తెలిపారు. డిజిటల్ మహిళా సేవకుల సేవలు వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. విత్తులు,నాట్లకు అనుకూల వారం పై ప్రచారం చేయాలి.  పల్లెపల్లెనా రైతులను చైతన్య పరచాలి.  6,403గ్రామాలలో బెస్ట్ సోయింగ్ పీరియడ్ పై సమాచారం అందుబాటులో ఉందని అయన అన్నారు. నీరు-ప్రగతి వల్ల చెరువుల్లోకి నీళ్లు వచ్చాయి. మన పనులను విపక్షాల నేతలు  డేగ కళ్లతో పరిశీలిస్తున్నారు. ఏ ఒక్క అవకాశం కూడా వాళ్లకు ఇవ్వకూడదని అన్నారు. 
నరేగా అమలులో ఎక్కడా చిన్న తప్పు కూడా జరగకూడదని, కేంద్రం మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని ఆదేశించారు. నరేగాలో గత 3నెలల్లో రూ.2,500కోట్లు ఉపాధివాటా నిధులు వినియోగించాం. మరో రూ.1600కోట్లు ఉపాధి వాటా సద్వినియోగం చేసుకోవాల్సివుంది.  గత 3 నెలల్లో లక్షా 5వేల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని చెప్పారు. జులై 5న రెండో విడత సామూహిక గృహ ప్రవేశాలు జరుగుతాయని తెలిపారు. ఒకే దఫా 3 లక్షల సామూహిక గృహ ప్రవేశాలు ప్రపంచంలో ఎక్కడా జరగలేదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా పేదలు అందరికీ సంక్షేమ పథకాలు అందించాలి. పేదలకు న్యాయం చేయడమే కాదు, న్యాయం చేశామన్న భావన వారిలో పెంపొందాలని అయన అన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment