హైద్రాబాద్, జూలై 6, (way2newstv.in)
అనామిక సినిమా ఫ్లాప్ తర్వాత కొన్నాళ్లు అఙ్ఞాతంలో ఉండలిపోయాడు శేఖర్ కమ్ముల. మూడేళ్ల వరకు ఏ సినిమా చేయకుండా కాళీగా ఉన్నాడు కమ్ముల. ఇక ఇతని ట్రెండ్ అయిపోతుంది అన్నటైం లో ఫిదాతో వచ్చి బ్లాక్ బాస్టర్ కొట్టి తన సత్తా చాటాడు. ఆ కాన్పిడెంట్ తో మళ్లీ ఓల్డ్ ఫార్మాట్ లోకి వెళ్లాలనుకుంటున్నాడు. తన దగ్గర ఉన్న కంటెంట్ తో టాప్ ప్రోడ్యూసర్ దిల్ రాజుని ఒప్పించి ఫిదా చేశాడు శేఖర్ కమ్ముల. ఈ సినిమా శేఖర్ లోనూ ఆత్మవిశ్వాసాన్నినింపింది. ఈసారి మరో నిర్మాత కథ చెప్పి ఒప్పించే పని లేకుండా ..మళ్లీ పాత స్టయిల్లో సొంత సినిమా చేయడానికి కమ్ముల రెడీ అవుతున్నాడట. ఫిదా తర్వాత పెద్ద బేనర్లు.. పెద్ద హీరోలు అతడితో పని చేయడానికి రెడీగా ఉన్నప్పటికీ.. సొంత బేనర్లో కొత్తవాళ్లతో సినిమా చేయడానికే కమ్ముల ఆసక్తితో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇంతకుముందు ఆనంద్, హ్యాపీడేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లాంటి సినిమాలు తీసిన తన సొంత నిర్మాణ సంస్ధ అమిగోస్ క్రియేషన్స్ బేనర్లోనే కమ్ముల తర్వాతి సినిమా ఉంటుందట. ఈ చిత్రంలో తన పాత సినిమాల లాగానే ఎక్కువమంది కొత్తవాళ్లను తీసుకోనున్నాడట కమ్ముల. ఫిదా రిలీజై దాదాపు సంవత్పరం కావస్తున్నా ఈ దర్శకుడు తర్వాతి సినిమానైతే ప్రకటించలేదు. బాగా టైం తీసుకున్నా స్క్రిప్టు పూర్తిగా రెడీ చేసుకొనే బరిలోకి దిగుతాడు కమ్ముల. ఈసారి కూడా ఓ యూత్ పుల్ లవ్ స్టోరీని రెడీ చేసే దశలో ఉన్నాడంట ఈ యూత్ పల్స్ తెలిసిన డైరక్టర్. మరి శేఖర్ కమ్ముల ఈ సారి ఎంతమంది మనసులు ఫిదా చేస్తాడో తెలియాలంటే మరి కొంత కాలం వెయిట్ చేయాల్సిందే.
యూత్ పుల్ లవ్ స్టోరీతో కమ్ముల
No comments:
Post a Comment