(way2newstv.in)
"తెలుసుకొవాలనుంది..వినాలనుం ది.. ఈ గడపదాటి ప్రతి గడపలోకి వెళ్ళాలనుంది..వాళ్ళతో కలసి నడవాలనుంది..వాళ్ళ గుండె చప్పుడు వినాలనుంది..గెలిస్తే పట్టుదల అంటారు..ఓడిపోతే మూర్ఖత్వం అంటారు..ఈ పాదయాత్ర నా మూర్ఖత్వమె .. పట్టుదలో చరిత్రనే నిర్ణయించుకొని.." అంటూ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రె్డ్డి గారి పాత్ర తీరును 56 సెకన్ల టీజర్ ద్వారా డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి జన్మదినోత్సవం సందర్బంగా తెలియజేశారు యాత్ర చిత్ర యూనిట్ .
ప్రజల గుండె చప్పుడు వినటానికి ప్రారంభమైన "యాత్ర"
మలయళం సూపర్‌స్టార్ మమ్ముట్టి రాజశేఖర్ రెడ్డి గారి పాత్రలో ఒదిగిపోయారు. ప్రస్తుతం శరవేగంగా ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది. ఈ చిత్రాన్నిభలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకి అందించిన 70ఎంఎం ఎంటర్టెన్మెంట్స్ బేనర్ పై నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఆనందో బ్రహ్మ ఫేమ్ మహి వి రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు ప్రజల ఆరాధ్య ప్రజానాయాకుడు కీర్తిశేషులు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్ర కథను దర్శకుడు మహి వి రాఘవ్ స్వయంగా రాసుకుని రూపొందిస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ...70 ఎం ఎం ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ లో ఆనందో బ్రహ్మతో ద్వితియ విజయాన్ని అందించిన మహి వి రాఘవ్ డైరెక్షన్ యాత్ర ప్రారభమైంది. ఈ యాత్ర కోసం మహి రెడీ చేసిన కథ అన్ని ఎమెషన్స్ తో తీర్చిదిద్దాడు. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి గారు ఈ పాత్రని పాత్ర తీరును డెడికేషన్ తో చేస్తున్నారు. గెటప్ దగ్గరనుండి మాడ్యూలేషన్ వరకూ అన్ని రాజశేఖర్ రెడ్డి గారిని గుర్తుచేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకూ వైవిధ్యమైన కథలు చేసిన మా బ్యానర్ లో ఇలా ఓ ప్రజానాయకుడు బయెపిక్ ని తెరకెక్కించటం చాలా ఆనందం కలిగింది. రెండు రాష్ట్రాల ప్రజలు ఆరాదించే నాయకుడు, ఎమోషనల్ గా ప్రజలకు దగ్గరైన వ్యక్తి వైయస్ గారు. ఆయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా భారీ బడ్జెట్ తో ఎమెషనల్ కంటెంట్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. వైయస్ఆర్ గారి పుట్టినరోజు సంధర్బంగా మెము ఓ టీజర్ ని విడుదల చేశాము.. ఇది చూసిన వైయస్ఆర్ అభిమానులు ఎమెషనల్ గా ఫోన్స్ చేస్తున్నారు. ఆయన అప్పుడు త్ర కి బయలుదేరిన సందర్బాలు మరోక్కసారి మాకు గుర్తోచ్చాయంటూ వారి అభిప్రాయాల్ని మాకు తెలియజేశారు. వారందరికి మా ధన్యవాదాలు.. ఈ చిత్రం తరువాత ప్రజలందరూ వైయస్ఆర్ గారిని మరోక్కసారి గుర్తుచేసుకుంటారనే నమ్మకం మాకుంది. అని అన్నారు..
బ్యానర్ : 70 ఎమ్ ఎమ్ ఎంటర్ టైన్ మెంట్ప్
నిర్మాతలు : విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి
కథ, దర్శకత్వం : మహి వి రాఘవ్
No comments:
Post a Comment