Breaking News

09/07/2018

నవంబర్ లో రాజమౌళి మల్టీ స్టారర్ ఫిల్మ్

హైద్రాబాద్, జూలై 9 (way2newstv.in)
‘బాహుబలి’తో తెలుగు సినిమా చరిత్రను తిరగ రాసిన ఎస్.ఎస్.రాజమౌళి తదుపరి చిత్రంపైనే అందరి దృష్టీ ఉంది. రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి ఓ భారీ మల్టీస్టారర్‌ను రూపొందించనున్నారు. ఆర్.ఆర్.ఆర్. అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.డి.వి.వి. దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా అక్టోబర్‌లో ప్రారంభమవుతుందని ఆమధ్య వినిపించింది. అయితే రామ్‌చరణ్, ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో బిజీగా ఉన్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్ సినిమా చేస్తుండగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ చిత్రాన్ని చేస్తున్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్స్ పూర్తయిన తర్వాతే రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం ప్రారంభమవుతుందని తెలుస్తోంది. తాజా సమాచారం మేరకు నవంబర్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళే అవకాశం ఉంది.



నవంబర్ లో రాజమౌళి మల్టీ స్టారర్ ఫిల్మ్

No comments:

Post a Comment