Breaking News

09/07/2018

టీడీపీ లెక్కలు తీస్తున్న కమలం

విజయవాడ, జూలై 09, (way2newstv.in)
ఏపీలో బీజేపీ-టీడీపీ నేత‌లు క‌త్తులు దూసుకుంటున్నారు. ఇరు పార్టీల నేత‌ల మ‌ధ్య మాట‌ల వార్ తార‌స్థాయికి చేరుతోంది. బీజేపీ న‌మ్మించి మోసం చేసిందని, అన్యాయం చేస్తోందంటూ సీఎం చంద్రబాబు ప‌దేప‌దే విమర్శల వ‌ర్షం కురిపిస్తున్నారు. నిన్నమొన్నటి వ‌ర‌కు ఈ విష‌యంలో మౌనంగా ఉన్న బీజేపీ నేత‌లు ఇప్పుడు బాబుకు ధీటుగా బ‌దులిచ్చేందుకు సిద్ధమ‌వుతున్నారు. చంద్రబాబు అంటే ఒంటి కాలిపై లేచే బీజేపీ సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్సీ సోము వీర్రాజు మ‌రోసారి ఆయ‌న‌పై సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు.తెలుగుదేశం పార్టీ అవినీతికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పుల కుప్పగా చేసి ప్రజల నెత్తిన భారం మోపుతున్నారని వీర్రాజు దుయ్యబ‌ట్టారు. ఇప్పటికే వస్తున్న నిధులు కాకుండా అప్పులను తెస్తూ రాష్ట్రాన్ని మరింత రుణభారంలోకి నెట్టేస్తున్నారని ఆగ్రహం వ్య‌క్తంచేశారు. 



టీడీపీ లెక్కలు తీస్తున్న కమలం

తెలుగుదేశం పార్టీ నేతలకు అసహనం పెరిగిపోయి తమ నాయకులపై దాడులు చేయిస్తున్నారని వీర్రాజు ఆరోపించారు. ఏదేమైనా వీర్రాజు తీవ్రమైన రేంజ్‌లో ఆరోప‌ణ‌లు చేయ‌డం చూస్తుంటే చంద్రబాబు, టీడీపీతో బీజేపీ ఢీ అంటే ఢీ అనేలా వ్యవ‌హ‌రిస్తోంది. నిన్నటి వ‌ర‌కు కాస్త మౌనంగానే ఉన్నా ఇప్పుడు ఎన్నిక‌ల హీట్ స్టార్ట్ అవ్వడంతో బీజేపీలో కొంద‌రు బాబుపై తోక‌తొక్కిన తాచులా విరుచుకుప‌డుతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో జ‌రుగుతున్న అవినీతినే ప్రధానాస్త్రంగా చేసుకుని విమ‌ర్శనాస్త్రాలు సంధించారు. సీఎం చంద్రబాబుతో పాటు ఆయ‌న‌కు అత్యంత స‌న్నిహితుడైన మ‌రో మంత్రిని టార్గెట్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందంటూనే.. ఆ మంత్రి ఏకంగా రూ.9వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ మ‌రోసారి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.ఏపీ సీఎం చంద్రబాబుపై సోము వీర్రాజు మ‌రోసారి విరుచుకుప‌డ్డారు. బీజేపీతో దోస్తీ స‌మ‌యంలోనే ఏమాత్రం ఉపేక్షించ‌ని ఆయ‌న‌.. విడిపోయిన చాలా రోజుల త‌ర్వాత మ‌ళ్లీ మైక్ ముందుకొచ్చారు. వ‌స్తూ వ‌స్తూనే మరోమారు ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాబు పాలన అంత గాడి తప్పిందని, అవినీతిమయం అయిందని ఆరోపించారు. అరవై వేల కోట్ల అవినీతి చంద్రబాబు హయాంలో విజయవంతంగా సాగిందని వీర్రాజు సంచలన ఆరోపణలు చేశారు. ఇందులో ఒక్క మంత్రి వాటానే రూ.30000 కోట్లని విమర్శలు చేశారు. తనమంత్రి వర్గ సహచరుల అవినీతి కోసం చంద్రబాబు నిధులన్నీ ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో ఎన్ ఆర్ జీఎస్ కింద సంవత్సరానికి 40వేల కోట్లు కేటాయిస్తే 9వేల కోట్లు కేవలం ఏపీకి ఇస్తున్నారు. వీటిలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోంద‌ని ఆరోపించారు.అర్బన్ హౌసింగ్ స్కీమ్ లో సుమారు 30 వేల కోట్ల అవినీతి జరిగిందని, నీరు-మట్టి పథకంలో మరో 30 వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ ఆరోపించారు. `బడ్జెట్ లో విద్యకు 30 వేల కోట్లు కేటాయించారు. వీటిలో 8 నుంచి 9 వేల కోట్లు చేతులు మారుతున్నాయి. విద్యకు కేటాయించిన నిధులన్నీ మంత్రి నారాయణ పరమవుతున్నాయి` అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. `సర్వశిక్షాఅభియాన్ లో పోస్టులు అమ్ముకుంటున్నారు. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు – ఎల్ ఈడీ బల్బులు, ఇల్లులు, 24 గంటల కరెంట్, నీరు చెట్టు, ప్రధాన మంత్రి భీమా, మరుగుదొడ్లు వంటి వాటిని కేంద్రమే భరిస్తుంది. ఆ సొమ్ముతో రాష్ట్రంలోని ఉన్న ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేయొచ్చు. టీడీపీ నేతల అవినీతితో ఈ నిధులన్నీ పచ్చ పార్టీ నేతల జేబుల్లోకి చేరుతున్నాయి.` అని విమ‌ర్శించారు.

No comments:

Post a Comment