Breaking News

03/07/2018

ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన యస్‌వి. రంగారావు

ఏలూరు, జూలై 03,(way2newstv.in)
తెలుగుజాతి చరిత్ర ఉన్నంతవరకూ యన్‌టిఆర్, యస్‌విఆర్ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతారని తెలుగునాట ఆ ఇద్దరూ నటులూ యుగపురుషులుగా కీర్తింపబడుతున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ప్రముఖ సినీనటుడు, విశ్వనటచక్రవర్తి సామర్ల వెంకట రంగారావు (యస్‌వి. రంగారావు) శతజయంతి సందర్భంగా మంగళవారం కలపర్రు టోల్‌గేట్ వై జంక్షన్‌లో 12.5 అడుగుల యస్‌వి. రంగారావు విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈసందర్భంగా యస్‌వి. రంగారావు నటించిన పలు చలనచిత్రాలలోని ప్రధాన ఫొటోలతో ఏర్పాటు చేసిన ఫొటో ఎ గ్జిబిషన్‌ను చంద్రబాబు ప్రారంభించి తిలకించారు. యస్‌వి. రంగారావు పుట్టి నేటికి 100 ఏళ్లు పూర్తికావడం అటువంటి మహానటుడి విగ్రహాన్ని తన చేతులు మీదుగా ఆవిష్కరించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తాననిచంద్రబాబు చెప్పారు. చరిత్రలో ఎ ంతోమంది పుడతారని అయితే వారిలో కొందరే యుగపురుషులుగా నిలుస్తారన్నారు. ఆకోవకు యన్‌టిఆర్, యస్‌విఆర్ తెలుగునాట ఇద్దరే ఇద్దరు సమ ఉజ్జీలుగా ముందుకు సాగారని చెప్పారు. యస్‌విఆర్ నటనలో నిండుతనం హుందాతనం మరెవ్వరికీ సాటి రావన్నారు. యస్‌విఆర్ లాంటి నటులు మరొకరు రావడం కష్టమే అన్నారు. మళ్లీ వారి స్ధాయి చేరేవారు ఎ వరూ లేరన్నారు. యస్‌విఆర్‌లో ఉన్న నిండుతనం, హుందాతనాన్ని చూపించే విధంగా శిల్పాన్ని రూపకల్పన చేసిన రాజ్‌కుమార్ వడయార్‌ను ముఖ్యమంత్రి అభినందించారు. యస్‌వి. రంగారావుకు సముచిత న్యాయం జరగలేదని ఏలూరు శాసనసభ్యులు బడేటి బుజ్జి మేనత్త బాధపడుతున్నదని చెప్పారని కానీ నేడు శ్రీ బడేటి బుజ్జి కృషి ఫలితంగా యస్‌వి రంగారావుకు తగిన గౌరవం లభించిందని మేనత్త కోరిక తీర్చి లోటును పూర్తి చేసిన ఘనత బడేటి బుజ్జికే దక్కుతుందని చంద్రబాబు చెప్పారు. ప్రస్తుతం యస్‌విఆర్ విగ్రహాన్ని నెలకొల్పిన ప్రాంతాన్ని యస్‌విఆర్ జంక్షన్‌గా నామకరణం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. యన్‌టిఆర్ నాయకుడుగా, ప్రతినాయకుడుగా యస్‌విఆర్ సినిమాలలో ప్రేక్షకులను అలరించే వారని అన్నారు. యస్‌విఆర్ డైలాగ్‌లు చెప్పడంలో వారికి వారే సాటి అని, భవిష్యత్తులో కూడా అటువంటి వారు పుట్టబోరని సియం అన్నారు. యన్‌టిఆర్, యస్‌విఆర్ పాతాళ##బైరవి, కలిసిఉంటే కలదు సుఖం, మాయాబజార్, ఆత్మబంధువు, చరణదాసి, ముఖ్యంగా పాండవ వనవాసం సినిమాల్లో ఎ ంతోచక్కగా హావభావాలతో నటన చేసారన్నారు . 



ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన యస్‌వి. రంగారావు

ఏలూరులో 60 ఎ కరాలు భూమి కొనుగోలు చేసి 12 వేల కుటుంబాలకు ఇళ్లు నిర్మిస్తున్నామని ఇందుకోసం ఒక్కొక్కరికీ మూడు లక్షలు ఇస్తున్నామని సియం చెప్పారు. దీనిమూలంగా ఆకాలనీల్లో 50 వేలమంది నివాసానికి అనువుగా టౌన్ షిప్ అభివృద్ధి పరిచి విద్యుత్తు, డ్రైయినేజీ, షాపింగ్ మాల్స్, తదితర సౌకర్యాలు కల్పిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఇళ్లు లేని పేదల స్వంత ఇంటి కల సఫలీకృతం చేస్తున్నామన్నారు. గతంలో కాంగ్రెస్ వాళ్లు కొన్ని ఇళ్లు కట్టిస్తామని పేదల సొమ్ము దోచుకున్నారని అయితే తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాకుండా లబ్దిదారులే నిర్మించేవిధంగా చర్యలు తీసుకున్నామన్నారు. అంతేకాక పట్టణాల్లో నాణ్యమైన ఇళ్లు కొన్ని స్వచ్ఛంధ సంస్ధలతో నిర్మిస్తున్నామని, డబ్బు ఉన్న వాళ్లు నిర్మించుకునే రీతిలో ఎ ంతో హుందాతనంగా ఈఇళ్లు ఉంటాయన్నారు. 
పేదలను దృష్టిలో ఉంచుకుని అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. విఆర్ఓలకు 10500 వరకూ, హోమ్ గార్డులకు 9 వేల నుండి 18 వేలవరకూ, అంగన్‌వాడీ కార్యకర్తలకు, సూపర్ వైజర్లకు 4 వేల నుండి 10500 వరకూ, ఆశా కార్యకర్తలకు 3 వేల వరకూ గౌరవ వేతనాన్ని అందిస్తున్నామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎ న్ని పనులు చేసినా తక్కువేనని అన్నారు. పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే పరిశ్రమలు, టూరిజం అభివృద్ది చెందాలన్నారు. అయితే ఇక్కడ భూమి ఇవ్వడానికి మీరు ముందుకు రావడం లేదని అన్నారు. కలపర్రు వద్ద భూమి ఇచ్చేందుకు ముందుకు వస్తున్నట్లు ప్రజాప్రతినిధులు చెబుతున్నారని అదే జరిగితే ఈప్రాంతంలో ఆధునిక నగరం అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. అమరావతి తర్వాత శాటిలైట్ సిటీగా ఏలూరు నగరం అభివృద్ది చెందుతున్నదన్నారు. ప్రజాప్రతినిధులు కోరుతున్న కోరిక మేరకు జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని సియం చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎ టువంటి అభివృద్ది కార్యక్రమానికైనా ఏపని అడిగినా సాధ్యాసాధ్యాలు మేరకు కాదనకుండా పనులు చేస్తామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న కొల్లేరు, మరోప్రక్క పట్టిసీమ, మరోప్రక్క పోలవరం ప్రాంతాలతోపాటు సముద్రతీరం, గోదావరి తీరాలలో బీచ్‌లు ఏర్పాటుతో మంచి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఇందుకోసం సమగ్ర ప్రణాళిక అమలు చేస్తామన్నారు. ఎ న్ని జన్మలెత్తినా పశ్చిమ ప్రజలు చూపుతున్న స్వాగత ఆదరాభిమానాలు మరువులేమని చంద్రబాబు చెప్పారు. ఈసందర్భంగా యస్‌విఆర్ కాంస్య విగ్రహాన్ని రూపకల్పన చేసిన ప్రముఖ శిల్పి రాజ్‌కుమార్ వడయార్‌ను ముఖ్యమంత్రి సత్కరించారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పితాని సత్యనారాయణ, కెయస్. జవహర్, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, జడ్‌పి ఛైర్మన్ శ్రీ ముళ్లపూడి బాపిరాజు, యంపీలు మాగంటి వెంకటేశ్వరరావు, తోట సీతారామలక్ష్మి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, శాసనసభ్యులు మొడియం శ్రీనివాసరావు, గన్ని వీరాంజనేయులు, ముప్పిడి వెంకటేశ్వరరావు, రామానాయుడు, ఎ మ్మెల్సీ షరీఫ్, పాందువ్వ శ్రీను, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్ధ ఛైర్మన్ పాలి ప్రసాద్, తెలుగుయువత అధ్యక్షులు మాగంటి రాంజీ, జిల్లా ప్రజాపరిషత్తు మాజీ ఛైర్మన్ కొక్కిరిగడ్డ జయరాజు, రాష్ట్ర చలనచిత్ర, నాటకరంగ సంస్ధ అభివృద్ధి ఛైర్మన్ అంబికా కృష్ణ, జిల్లా కలెక్టరు డా. కాటంనేని భాస్కర్, జిల్లా యస్‌పి రవిప్రకాష్, ఏలూరు మున్సిపల్ మాజీ ఛైర్మన్ ఉప్పాల జగదీష్‌బాబు, పలువురు జడ్‌పిటిసిలు, యంపిపిలు, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment