Breaking News

13/07/2018

విద్యాశాఖ పై కడియం శ్రీహరి సమీక్ష

వరంగల్, జూలై 13, (way2newstv.in)
వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ జిల్లాల విద్యా శాఖపై వరంగల్ రూరల్ కలెక్టర్ కార్యాలయంలో   ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి సమీక్ష నిర్వహించారు. ఈ భేటీకి విద్యా శాఖ సంచాలకులు విజయ్ కుమార్, కలెక్టర్లు ఆమ్రపాలి, హరిత, వినయ్ కృష్ణా రెడ్డి, విద్యా శాఖ చీఫ్ ఇంజినీర్ మల్లేశం, ఆర్జేడీ రాజీవ్, డి.ఈ.ఓ నారాయణ రెడ్డి, ఇతర అధికారులుహజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి కడియం మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో చదువుకునే వాతావరణం కల్పించాలి. ప్రతి పాఠశాలలో పనిచేసే టాయిలెట్స్ ఉండాలి, నీటి సరఫరా, విద్యుత్ సరఫరా, కనీస వసతులు, అదనపు తరగతి గదులు, ప్రహరీ గోడలు ఉండాలి, పాఠశాలల కు కలర్స్ వేయాలని సూచించారు. ఉపాధ్యాయుల బదిలీల నేపథ్యంలో వెంటనే ఖాళీలు గుర్తించి విద్యా వలంటీర్లను నియమించుకోవాలి. ప్రతి పాఠశాల ప్రొఫైల్ర్ తయారు చేయాలి. అందులో పాఠశాల విస్తీర్ణం, విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య, ఉన్న సౌకర్యాలు, కావాల్సిన వసతుల పూర్తి సమాచారం ఈ స్కూల్ ప్రొఫైల్ లో ఉండాలని అన్నారు. ప్రతి మండలానికి కలిపి ఒక రిపోర్ట్ ని పాఠశాలల వారీగా ఈ ప్రొఫైల్ రూపొందించాలి. ప్రాధాన్యతల ప్రకారం ఆయా పాఠశాలాల్లో కావాల్సిన వసతులపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి పంపాలి. మొత్తానికి వరంగల్ ఉమ్మడి జిల్లాలోని విద్యా సంస్థలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి. దీనిని ప్రయోగాత్మకంగా చేపట్టి విజయవంతం చేసి రాష్ట్రమంతా చేపట్టాలనిఅన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఏ ఒక్క విద్యార్థి కింద కూర్చోవద్దు. పాఠశాలలన్ని కలర్ ఫుల్ గా ఉండాలి. పరిశుభ్రంగా ఉండాలి. మనసు పెట్టి పనులు చేయాలని అన్నారు. పనిచేసే టాయిలెట్స్,  నీటి సరఫరా, డ్యూయల్ డెస్క్ లు, విద్యుత్ సరఫరా,  వైట్ వాష్, కలర్స్ వేయడం, అదనపు గదులు, పాత భావనాల మరమ్మత్తు, ప్రహరిగోడలు నిర్మించేలా ప్రాధాన్యత రూపొందించుకొని నిధులు ఖర్చు చేయాలి. మీరు పెట్టే ప్రతిపాదనలకు నిధుల కొరత రాకుండా చూసుకునే బాధ్యత నాదని అయన భరోసా ఇచ్చారు.



విద్యాశాఖ పై కడియం శ్రీహరి సమీక్ష

No comments:

Post a Comment