వికారాబాద్, జూలై 2, (way2newstv.in)
హరిత హారం రాష్ట్రానికి మణీహారం కావాలి. రాష్ట్రం లో ఏటా 40 కోట్ల మొక్కలు నాటే హరిత హారం ఈ సారీ ఉద్యమంలా సాగాలని రవాణా మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. సోమవారం నాడు వికారాబాద్ కలెక్టరేట్ లో తెలంగాణ హరిత హారం మొక్కల పెంపకం , నిర్వాహణ మీద శిక్షణ శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఓమర్ జలీల్, ఎస్పీ అన్నపూర్ణ, ఎంఎల్ఏ సంజీవరావు, రాష్ట్ర విద్యా మౌలిక సదుపాయాలు సంస్థ చైర్మన్ నాగేందర్ గౌడ్, ప్రజా ప్రతినిధులు కుడా పాల్గోన్నారు. మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ప్రణాళిక బద్ధంగా కోటీ 40 లక్షల మొక్కలను 374 గ్రామాల్లో నాటాలి. నాటిన ప్రతీ మొక్క ఎదిగేలా సామాజిక బాధ్యత గా హరిత హారం సాగాలి. ప్రతీ గ్రామంలో రక్షణ కమిటీ ల ద్వారా మొక్కల పెంపకం మీద అవగాహన కల్పించాలని సూచించారు. సీఎం కేసీఆర్ చేపట్టిన హరిత యజ్ఞంలో ప్రతీ ఒక్కరూ బాధ్యత గా హరిత తెలంగాణ సాధనకు కృషి చేయాలని అన్నారు.
హరితహారాన్ని విజయవంతం చేయాలి
No comments:
Post a Comment