Breaking News

02/07/2018

కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ఈ నగరానికి ఏమైంది

హైద్రాబాద్ జూలై 2, (న్యూస్ పల్స్)

తరుణ్ భాస్కర్ సినిమాగా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపిన ‘ఈ నగరానికి ఏమైంది’ ఫర్వాలేదనే వసూళ్లను సంపాదించుకుంటూ సాగుతోంది. అయితే ‘పెళ్లి చూపులు’లు స్థాయిలో ఈ సినిమా సత్తా చూపలేకపోతోందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ‘పెళ్లిచూపులు’ దర్శకుడు తరుణ్ భాస్కర్ సినిమాగా ఇది మొదటి నుంచి ఆసక్తిని రేపింది. వెరైటీ టైటిల్ తో రెండో సినిమాతో ఈ దర్శకుడు సత్తా చూపిస్తాడని ప్రేక్షకులు ఆశించారు. ఆ ఆశలు కొంతమేర నెరవేరాయి కూడా. సినిమా ఫర్వాలేదనిపించుకుంది.  ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. ఈ సినిమాకు ప్రధానంగా యూత్, మల్టీప్లెక్స్ ఆడియన్సే టార్గెట్. అలాగే ఓవర్సీస్. అమెరికాలో ఈ సినిమా మంచి ఓపెనింగ్స్‌ను పొందిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. యూఎస్‌లో తొలి వీకెండ్‌కు ‘ఈ నగరానికి ఏమైంది’ 3.60 లక్షల డాలర్ల వసూళ్లను పొందిందని ట్రేడ్ ఎనలిస్టులు చెబుతున్నారు. చిన్న బడ్జెట్ సినిమానే కాబట్టి ఇవి మంచి వసూళ్లే అని చెప్పాలి. అయితే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ‘పెళ్లి చూపులు’ సినిమా తొలి వీకెండ్‌లోనే మూడు లక్షల డాలర్ల వసూళ్లను సాధించింది. దానితో పోలిస్తే ‘ఈ నగరానికి ఏమైంది’కి వచ్చిన వసూళ్లు అదే స్థాయివే. అయితే పెళ్లి చూపులు పాజిటివ్ టాక్‌తో పుంజుకుంది. యూఎస్‌లోనే ఆ సినిమా వన్ మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించింది. ఈ వారంలో వచ్చే వసూళ్లను బట్టి.. ‘ఈ నగరానికి ఏమైంది’ పూర్తి కథ తేలుతుంది. అయితే ఈ సినిమా బడ్జెట్ పరిమిత స్థాయిలో ఉండటం తో వసూళ్ల విషయంలో ఇది సేఫ్ జోన్లో ఉందని అంటున్నారు. 



కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ఈ నగరానికి ఏమైంది

No comments:

Post a Comment