సిర్పూర్, జూలై 3, (way2newstv.in)
అసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి జోగురామన్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కాగజ్ నగర్ మండలంలోని జగన్నాధ పూర్ ప్రాజెక్ట్ ను సందర్శించిన మంత్రి జోగు రామన్న పనులు నత్తనడక సాగుతుండడం గమనించి గడువు లోగ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సిర్పూర్ టి గ్రామం లో 3 కోట్ల తో నూతనంగా నిర్మించిన 5 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల నాబార్డ్ గోదాం, 1 కోటి రూపాయలు తో నిర్మించిన ఎంపీడీఓ కార్యాలయం, సిర్పూర్ నుండి ఇంథాని వరకూ బి.టి రోడ్ పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ సిర్పూర్ నియోజకవర్గానికి ఇప్పటి వరకు 800 కోట్ల రూపాయల తో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన్నట్లు తెలిపారు. రానున్న రోజులలో మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. మంత్రి వెంట స్థానిక శాసన సభ్యులు కోనేరు కొనప్ప, ఎంపీ నగేష్ వున్నారు.
సిర్పూర్ లో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసిన మంత్రి జోగురామన్న
No comments:
Post a Comment