Breaking News

13/07/2018

ఎన్టీఆర్ ను తెగపొగిడిసిన ఈషా రెబ్బ

హైద్రాబాద్, జూలై 13 (way2newstv.in)
యంగ్ టైగర్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా అరవింద సమేత షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ నుండి వరంగల్ కి షిఫ్ట్ అయ్యింది. అక్కడ ఎన్టీఆర్ – ఇంకా ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈషా రెబ్బ సన్నివేశాలను త్రివిక్రమ్ చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ సినిమాలో పూజ హెగ్డే మెయిన్ హీరోయిన్ కాగా ఈషా సెకండ్ హీరోయిన్. అయితే అరవింద సమేత తో అరవింద గా టైటిల్ రోల్ లో పూజ హెగ్డే పోషిస్తుండగా.. ఎన్టీఆర్ కి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా ఈషా రెబ్బ నటించబోతుంది. పూజ హెగ్డే – ఈషా రెబ్బ లు అక్కచెల్లెలుగా నటిస్తున్నారని టాక్.అక్క ఈషా రెబ్బ తో లవ్ అఫైర్ నడిపిన ఎన్టీఆర్ తర్వాత చెల్లెలు పూజ హెగ్డే తో ప్రేమాయణం సాగిస్తాడనే ప్రచారం జరుగుతుంది. ఇక ప్రస్తుతం ఈషా రెబ్బ – ఎన్టీఆర్ కాంబోలో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. ఎన్టీఆర్ తో షూటింగ్ లో పాల్గొన్న ఈషా రెబ్బ ఇటీవల ఓ సందర్భంలో ఎన్టీఆర్ ని తెగ పొగిడేస్తూ మాట్లాడింది. సెట్ లో ఎన్టీఆర్ చాలా కూల్ గా ఉంటారని, తన ఈజీ గోయింగ్ నేచర్ వల్ల అందరం కంఫర్టబుల్ గా ఉంటామని తెలియజేసింది . మరి ఈషా రెబ్బ కూడా ఈ సినిమాలో అత్తారింటికి దారేది సినిమా లో ప్రణీత మాదిరిగా ఒక మంచి పాత్రని సొంతం చేసుకుందో.. లేదంటే సన్నాఫ్ అఫ్ సత్యమూర్తి లో అదః శర్మ పాత్ర లా లైట్ గా ఉంటుందో చూడాలి.



ఎన్టీఆర్ ను తెగపొగిడిసిన ఈషా రెబ్బ

No comments:

Post a Comment