హైద్రాబాద్, జూలై 3, (way2newstv.in)
బుల్లితెర హోస్ట్ గా, వెబ్ సిరీస్ లో నటిగా మంచి పేరు తెచ్చుకుంది కొణిదెల నిహరిక. ఒక మనసు సినిమాతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన మెగా వారసురాలు తాజాగా నటించిన చిత్రం హ్యాపీ వెడ్డింగ్. సుమంత్ అశ్విన్ హీరోగా నటించారు. ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం జరిగింది. ఆ విశేషాలు మీ కోసం.లక్ష్మన్ కర్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని యూవీ క్రియేషన్స్ పతాకంపై ప్రమోద్ వంశీ నిర్మిస్తున్నారు. ఇటీవలే ఓరు నల్ల నాల్ పాతు సోలెరన్ తో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ హీరోయిన్ గా మంచి విజయాన్ని సాధించింది. తెలుగులో సరైన విజయం కోసం ఎదురు చూస్తున్న నిహరిక హ్యపీ వెడ్డింగ్ పై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. ఇటీవలే నిహారిక ఈ సినిమా ప్రమోషన్ ను కొత్తగా మొదలుపెట్టింది. తన పెళ్లి గురించి ప్రశ్నించిన యూట్యూబర్ ను తిడుతున్నట్టు విడుదల చేసిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా హ్యాపీ వెడ్డింగ్ ట్రైలర్ ను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా విడుదల చేశారు. ఫిదా ఫేం శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందించగా.. తమన్ బ్యాక్ గ్రౌండ్ ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ఈ మేరకు ట్రైలర్ లో వీరి సంగీతం ఆకట్టుకుంది.గత కొంత కాలంగా హిట్ లేని హీరో సుమంత్ అశ్విన్ కి కూడా ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. మరి ఈ జోడి కెరియర్ కి హ్యాపీ వెడ్డింగ్ సినిమా ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియాలంటే మరి కొంత కాలం వెయిట్ చేయాల్సిందే.
హ్యపీ వెడ్డింగ్ లో నిహారిక సందడి
No comments:
Post a Comment