(way2newstv.in)
వెంకటరమణ మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలతో సోమవారం ప్రారంభం అయ్యింది. శ్రీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో డింపుల్ చోపడే, నటషా దోషి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. డింపుల్ చోపడే సునీల్ 'కృష్ణాష్టమి' చిత్రంలో నటించింది. అలాగే నటాషా దోషి బాలకృష్ణ 'జై సింహ' సినిమాలో నటించింది. కథ నచ్చడంతో శ్రీకాంత్ ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారు. సుధీర్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కొలన్ వెంకటేష్ నిర్మిస్తున్నారు. గతంలో సుధీర్ రాజు సుబ్బరాజుతో 'జయహే' చిత్రానికి దర్శకత్వం వహించారు. షియాజి షిండే, పోసాని కృష్ణ మురళి, జయప్రకేష్ రెడ్డి, సత్యం రాజేష్ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్న ఈ సినిమాకు డి.జే. వసంత్ సంగీతం అందిస్తున్నారు. ఈనెల 16 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా ఆగస్ట్ చివారివారంలో షూటింగ్ పూర్తి చేసుకోనుంది. రాజమండ్రి, బెంగుళూరులో చిత్ర షూటింగ్ అధికభాగం చిత్రీకరణ జరుపుకోనుంది. నటీనటులు: శ్రీకాంత్, డింపుల్ చోపడే, నటాషా దోషి, షియాజి షిండే, పోసాని కృష్ణ మురళి, జయప్రకేష్ రెడ్డి, సత్యం రాజేష్, పృద్వి, చంద్రమోహన్, సుధ, హేమ, శ్రీ లక్ష్మీ, జయవాణి, తాగుబోతు రమేష్.
శ్రీకాంత్ హీరోగా వెంకటరమణ మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం ప్రారంభం!
No comments:
Post a Comment