Breaking News

29/06/2018

ఏరువాకను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

శ్రీకాకుళం జూన్ 29 (way2newstv.in)
శ్రీకాకుళం జిల్లా  ఆమదాలవలస మండలం జగ్గుశాస్తుల పేట ఎన్ టి ఆర్ గ్రీన్ ఫీల్డ్ క్రీడా ప్రాంగణం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏరువాక, చంద్రన్న రైతుభీమా పథకాన్ని ప్రారంభించారు. అయనమాట్లాడుతూ ఈరోజు నిజమైన పండగరోజు. తాను నిజమైన రైతుకుటుంభం నుంచి వచ్చా.. అందుకు రైతన్న ఆనందం కోసం అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు. చందన్న రైతు భీమా ను ఈ నెల నుంచే అమలు చేస్తాం. రైతు లేకపోతే తిండి లేదు అందుకు రైతన్నకు ప్రతిఒక్కరూ సంఘీభావం తెలిపాలసిన అవసరం ఎంతైనా ఉంది. 24 వేల కోట్ల రూపాయల రుణ విముక్తి చేసిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమని అన్నారు. 



ఏరువాకను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

లక్షా 50 వేల రూపాయలు వరకూ రుణ విముక్తి చేసాం. గత పాలకులకు మనసు లేదు.. వారి అవినీతి కి అంతు లేదు. ఒక్క వ్యవసాయనికే 82 వేల కొట్ల రూపాయలు ఖర్చు చేసాం. వ్యవసాయంలో యాంత్రీకరణం పెరిగి ఖర్చులు తగ్గించాలని అన్నారు. రెండు అంకెలు వృద్ధి సాధించాలంటే వ్యవసాయంలో వృద్ది సాధించాలని నీతి ఆయోగ్ లోనే కేంద్ర ప్రభుత్వాన్ని  నిలదీశాను. వంశధార, నాగావళి, మహేంద్ర తనయ, బహుధా నదుల అనుసంధానం 2030 కి పూర్తి చేస్తాం. నారాయణపురం ఆనకట్ట ఆధునీకరణ పూర్తి చేస్తామని అన్నారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి 8 లక్షలు ఎకరాలకు నీరిచ్చే భాద్యత ప్రభుత్వం తీసుకుంటుంది. జిల్లా రైతాంగానికి నీరు అందించే బాధ్యత నాది... బంగారం పండించే భాద్యత మీదని రైతన్నలను ఉద్దేశించిఅన్నారు. ఉపాధి హమీ పనులను వ్యవసాయనికి అనుసంధానం చేయాలని నీతి ఆయోగ్ నేనే చెప్పా. ఏ జిల్లాకు ఇవ్వని ఎన్టీఆర్ జలసిరి యూనిట్ లను శ్రీకాకుళం విజయనగరం జిల్లాలకు ఇచ్చాం. ప్రతి ఒక్కరూ చెట్లు నాటి పకృతిని కాపాడాలని అన్నారు. పసువుల యొక్క పేడ నేరుగా మీ ఇంటికి వచ్చి కలెక్ట్  చేస్తారు.  ప్రతి ఇంటికి కొలాయి ద్వారా త్రాగునీరు అందిస్తాం. 54 ప్రాజెక్టులకు 34 ప్రొజెక్ట్ లు పూర్తి చేసాం.. మిగిలినవి 2020 కి పూర్తి చేస్తాం. కేంద్రం.. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వకుండా మోసం చేసిందని విమర్శించారు. ఉత్తరాంధ్ర ను అభివృద్ధి చేయలేదని కొంతమంది కొత్త నాయకులు  చెపుతున్నారు. తెలుగు దేశం ప్రభుత్వం కంచుకోట ఉత్తరాంధ్ర అటువంటి ఉత్తరాంధ్ర ను అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఉద్దానం కిడ్నీ బాధితులకు 2500 రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మొన్నటి వరకు కాంగ్రెస్ లో ఉండి ఇప్పుడు బిజెపి లో చేరి వైయస్ ఆర్ పార్టీ కి అద్దె మైకు.. బిజెపి సొంత మైకు లా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఆమదాలవలస నియోజకవర్గంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తా. పొందూరు ఖాదీ క్లస్టర్ కూడా మంజూరు చేస్తా..మత్యకారులు ఎస్టీ జాబితాలో చేర్చేందుకు. వన్ మేన్ కమిషన్ వేసామని అన్నారు. షుగర్ ఫ్యాక్టరీ ఉన్న ప్రదేశంలో.. ఐటి పార్కు తీసుకొస్తాం. నారాయణపురం ఆనకట్ట ఆధునీకరణకు తమ్మినేని పాపారావు పేరును అనుమతి ఇస్తున్నామని వెల్లడించారు.

No comments:

Post a Comment